: పాక్ దూకుడుకు కళ్ళెం వేయండి: సోనియాగాంధీ


జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత జవాన్ల మరణానికి కారణమైన పాకిస్థాన్ సైన్యంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదునుచూసి తెగబడుతున్న పాక్ ఆర్మీపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మోసపూరిత ధోరణితో మనవాళ్ళ మరణాలకు కారణమైన పాక్ ను నిలువరించాలన్నారు. కాల్పుల్లో అమరవీరులైన జవాన్లకు దేశం మొత్తం, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా జవాన్లకు ఆమె తన సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News