: దిల్ సుఖ్ నగర్ సీసీటీవీ కెమేరాలలో కీలక ఆధారాలు!
నలువైపుల నుంచి విమర్శల జడి వాన కురుస్తున్న దశలో బాంబు పేలుళ్లకు సంబంధించి కీలక ఆధారాలు పోలీసులకు లభించడం వారికి కొంత ఉపశమనాన్ని కలిగించాయి. దిల్ సుఖ్ నగర్ లో సీసీటీవీ కెమేరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకుండా పోయాయని, వాటి వైర్లు తెంపేశారనే వార్తలు వచ్చాయి. కానీ, ఘటనా ప్రదేశంలో ఉన్న సీసీటీవీ కెమేరాలు కొన్ని పనిచేయడం విశేషం. వీటి రికార్డుల ఆధారంగా నిందితుల ఆచూకీ పట్టుకునేందుకు దర్యాప్తు అధికారులు దష్టి సారించారు.
పేలుళ్లు జరగడానికి గంట ముందు ఐదుగురు వ్యక్తులు అక్కడ సైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగాడినట్లు కెమేరాలలో నమోదైంది. అలాగే నిలిపి ఉంచిన సైకిల్ చిత్రాలను పోలీసులు పరిశీలించారు. సాయంత్రం 6.38 గంటల ప్రాంతంలో ఒక సైకిల్ ను తీసుకొచ్చి ఘటనా స్థలంలో నిలిపి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. దీంతో కెమేరా ఫుటేజ్ ల ఆధారంగా సైకిళ్లపై సంచరించిన వారిని గుర్తించి, పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాలు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లాయి. తహ్సీన్ అక్తర్ అలియాస్ మోను అలియాస్ హసన్.. ఇతడి సహచరులు అసదుల్లా అఖ్తర్ అలియాస్ తాబ్రెజ్, వాకాస్ అలియాస్ అహ్మద్ అనే ముగ్గురికి హైదరాబాద్ బాంబు పేలుళ్లలో పాత్ర ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. వీరిని పట్టుకునేందుకే ఎన్ఐఏ బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయి. అలాగే, జైలులో ఉన్న ఐఎమ్ ఉగ్రవాది మక్బూల్ భట్ ను కూడా పోలీసులు ఈ రోజు విచారించారు. దీంతో వచ్చే ఒకటి రెండు రోజులలో పేలుళ్ల గుట్టును దర్యాప్తు బృందాలు విప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

- Loading...
More Telugu News
- Loading...