: ఎట్టకేలకు పాస్ పోర్టు సాధించిన మాజీ తీవ్రవాది మేనకోడలు


కాశ్మీరీ బాలిక సుఫైరా జాన్ ఎట్టకేలకు పాస్ పోర్టు సాధించగలిగింది. ఓ అనాథాశ్రమంలో నివసిస్తున్న సుఫైరా భారత్, అమెరికా యూత్ ఎక్చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఏడాది పాటు అమెరికాలో చదువుకునేందుకు స్కాలర్ షిప్ సాధించింది. కానీ అక్కడ చదువుకునేందుకు వీలుగా భారత్ లో పాస్ పోర్టు సాధించలేకపోయింది. దీనికి కారణం ఆమె మేనమామ నేపథ్యమే. అతను సుఫైరా పుట్టకముందు మిలిటెంట్ గా పని చేశాడు. దీంతో అధికారులు ఆమెకు పాస్ పోర్టు నిరాకరించారు. అయితే, ఈ వ్యవహారంలో మీడియా చైతన్యవంతంగా పని చేయడంతో సీఐడీ అధికారులు జోక్యం చేసుకుని ఆమెకు పాస్ పోర్టు వచ్చేలా చేశారు. దీంతో, ఆమె అమెరికా వెళ్ళేందుకు లైన్ క్లియరైంది.

  • Loading...

More Telugu News