: సాగు భారమైంది.. అవయవాలు అమ్ముకుంటామంటున్న రైతన్నలు


నీరు, నారు, నక్కు, నాగలి అన్నీ భారమయ్యాయి. ఎరువులు, మందులు తలకు మించిన భారమయ్యాయి. వ్యవసాయ కూలీలు అందుబాటులో లేరు, ఉన్న వారిని అందుబాటులోకి తేవాలంటే ఇళ్లమ్ముకోవాలి.. అలా పెరిగిపోయాయి వారి కూలీ రేట్లు. దీంతో ఏరువాక సాగడం లేదు. గుండె మండుతోంది, కళ్ల ముందు భూములు బీళ్లు వారుతున్నాయి. ఇటు వంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్యాంకులు కూడా ఆదుకోవడం మానేశాయి. దీంతో, హర్యానా రైతులు తమ అవయవాలు అమ్ముకునేందుకు అనుమతి ఇప్పించాలని ప్రధానిని అడుగుతున్నారు.

భారత్ కిసాన్ యూనియన్(తికాయత్) కు చెందిన 33 మంది రైతులు కురుక్షేత్రలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానికి పంపాలంటూ కురుక్షేత్ర తహసిల్దార్ కు ఓ లేఖను ఆయనకు అందజేశారు. రైతులకు సబ్సిడీలు లేక, వ్యయం ఎక్కువై, పండిన పంటకు మద్దతు ధర రాక అప్పుల పాలై, బ్రతుకు భారమై, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 20 వేల మందికి పైగా రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆ లేఖలో వారు ఆరోపించారు. కనీసం తమ అవయవాలు అమ్ముకునేందుకు అవకాశమిస్తే తాము మరి కొంతకాలం బ్రతుకుతామని అర్ధించారు. ఈ లేఖ హర్యానాలో కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News