: ఇన్ఫోసిస్ పై జాతి వివక్ష ఆరోపణలు


తన పట్ల జాతి వివక్ష చూపారంటూ ఓ అమెరికన్ పౌరురాలు ఐటి దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ పై ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంపెనీపై అమెరికాలోని విస్కాన్ సిన్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. భారత్ కు చెందిన ఇన్ఫోసిస్ కంపెనీలొ అమెరికన్లపై వివక్ష చూపడం అలవాటుగా మారిందంటూ ఫిర్యాదులో తెలిపింది. వెంటనే స్పందించిన కోర్టు ఇన్ఫోసిస్ కు సమన్లు జారీ చేసింది. బ్రేండా కొహ్లెర్ అనే యూఎస్ మహిళ ఉద్యోగి దరఖాస్తును కొన్ని కారణాలతో ఇన్ఫోసిస్ తిరస్కరించింది. అదే స్థానంలో బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని నియమించి జాతి వివక్షను చూపిందంటూ ఆరోపించింది. అయితే, ఈ వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఖండించింది.

  • Loading...

More Telugu News