: కేసీఆర్ ను హత్య చేసేందుకు కుట్ర: హరీశ్ రావు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను హత్య చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ అన్నారు. ఇందుకు కొంతమందికి సుపారీలు ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. దీనిపై అదనపు డీజీని కలిసి వివరాలు తెలియజేశామన్నారు. ఈ కుట్రపై పూర్తి విచారణ జరిపించాలని, కేసీఆర్ కు జడ్ ప్లస్ కేటగిరి రక్షణ కల్పించాలని హరీశ్ రావు డిమాండు చేశారు. కేసీఆర్ కు ప్రాణహాని జరిగితే అనంతర పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు.