: మమ్మల్ని తగలబెట్టినా అదే మాట చెబుతాం: నారాయణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మరోమారు తనదైన శైలిలో మాటలు రువ్వారు. హైదరాబాదులో నేడు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై స్పందిస్తూ, తెలంగాణపై మరోమాటే లేదన్నారు. దిష్టిబొమ్మలను కాకుండా తమను తగలబెట్టినా తెలంగాణకు అనుకూలమనే చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై తమ విధానం ఇదేనని తెగేసి చెప్పారు. అయితే, రెండు ప్రాంతాల ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని నారాయణ పేర్కొన్నారు.