: సీకే బాబు దీక్ష భగ్నం చేసిన పోలీసులు


చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు దీక్షను పోలీసులు నేడు భగ్నం చేశారు. ఆరు రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న బాబును పోలీసులు బలవంతంగా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీకే బాబును తరలిస్తున్న సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో వారిని కూడా అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News