: సీమాంధ్ర జేఎసీ భవిష్యత్ కార్యాచరణ
సీమాంధ్ర జేఏసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అన్ని యూనివర్సిటీల ప్రతినిధులు, రాజకీయ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణకు పలు తీర్మానాలు చేశారు. ఈ నెల 7,8 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధించాలని నిర్ణయించారు. 9,10 తేదీల్లో రైల్ రోకోకు పిలుపునిచ్చారు. 11,12 తేదీల్లో అన్ని జిల్లా మండల కేంద్రాలు, పట్టణాల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని సూచించారు. 13,14 తేదీల్లో రాజీనామాలు చేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడించాలని నిర్ణయించారు. అనంతరం గుంటూరు వేదికగా అన్ని రాజకీయ పక్షాల నేతలతో భారీ సదస్సు నిర్వహించాలని తీర్మానించారు.