: 'గ్రేటర్ రాయలసీమ' ఇవ్వండి.. సోనియాకు కర్నూలు నేతల విజ్ఞప్తి
గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని కర్నూలు నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తెలిపారు. ఒకవేళ విభజన చేయాలనుకుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటుచేయాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీవై రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామి, మురళీకృష్ణ పార్లమెంటు ఆవరణలో సోనియాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉన్నత స్థాయి కమిటీకి అన్ని అంశాలు తెలపాలని సోనియాకు కర్నూలు నేతలు సూచించారు.