: విద్యుత్ సౌధలో ఉద్యోగుల పరస్పర నినాదాలు.. ఉద్రిక్తత


హైదరాబాదులో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమం రసవత్తరంగా మారుతోంది. సీమాంధ్ర ఉద్యోగులు భోజన విరామ సమయంలో నినాదాలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పయ్యావుల కేశవ్ విద్యుత్ సౌధకు రాగా ఇరు ప్రాంత ఉద్యోగులు నినాదాలతో మరోసారి హోరెత్తించారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఉద్యమం చేసినప్పుడు తాము సహకరించామని అది గుర్తుంచుకోవాలని ఆంధ్ర ఉద్యోగులు సూచించారు. దీంతో మండిపడ్డ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ నెలకొన్న వాతావరణం ఉద్యోగుల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోయే పరిస్థితి తలెత్తింది. ఆంధ్ర ఉద్యోగుల భయాలను నిజం చేసే పరిస్థితి ఇప్పుడే కళ్ళకుకడుతోంది.

  • Loading...

More Telugu News