: కుమార్తె ప్రేమకు వర్మ ఓకే.. వివాహం ఈనెల 15న


వివాదమే ఊపిరిగా జీవించే దర్శకుల్లో రాంగోపాల్ వర్మదే ప్రథమస్థానం. సినిమా మొదలెట్టింది మొదలు అది రిలీజయ్యేదాకా ఏదో ఒక విధంగా వర్మ వార్తల్లో కనిపిస్తుంటారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం కాంట్రవర్సీ. ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే, వర్మకూ ఓ కుటుంబం ఉందని, పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉందన్న విషయం కొద్దిమందికే తెలిసి ఉంటుంది. వ్యక్తిగత విషయాలకు ఆయనిచ్చే ప్రాముఖ్యత అలాంటిది. కాగా, వర్మ తనయ పేరు రేవతి. మెడిసిన్ చదువుతోంది. క్యాంపస్ లో ఉండగానే సహధ్యాయి ప్రణవ్ తో ప్రేమలో పడిందట. ఇరు కుటుంబాలు వీరి అనుబంధానికి పచ్చజెండా ఊపడంతో జనవరిలో నిశ్చితార్థం జరుపుకుందీ ప్రేమజంట.

ఇక పెళ్ళి ఈ నెల 15న అంటే స్వాతంత్ర్యదినోత్సవం రోజున జరగనుంది. వర్మ ఈ వివాహానికి అతికొద్ది మందినే ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడట. బంధువులు, సన్నిహితుల నడమ నిరాడంబరంగా జరిపేందుకు నిశ్చయించినట్టు తెలుస్తోంది. కుమార్తె ప్రేమను అంగీకరించిన వర్మ సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ తనది అదే పంథా అని చాటాడనుకోవచ్చు. ఇటీవలే చేరన్ అనే తమిళ దర్శకుడు కుమార్తె ప్రేమకు విలన్ లా పరిణమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News