: కామన్వెల్త్ క్రీడా సన్నద్ధతపై మంత్రి అసంతృప్తి


వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్, ఆసియా క్రీడలకు భారత ఆటగాళ్ల సన్నద్ధతపై క్రీడా శాఖా మంత్రి జితేంద్ర సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) క్రీడాకారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ విభాగానికి చీఫ్ కోచ్, అతడికి కొంత మంది సహాయకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాబబుల్స్ కు కోచింగ్ బాధ్యత వీరిదేనని చెప్పారు. ప్రతీ విభాగంలో ఆటగాళ్ల శిక్షణ తీరును పర్యవేక్షించేందుకు క్రీడాశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2014లో గ్లాస్గోలో కామన్వెల్త్ క్రీడలు, సియోల్ లో ఆసియా గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News