: కొచ్చి విమానాశ్రయంలో నీరు.. నిలిచిన రాకపోకలు
కేరళలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొచ్చి విమానాశ్రయం రన్ వే పై భారీగా నీరు చేరింది. దీంతో ఈ రోజు కూడా విమానాశ్రయానికి రాకపోకలు అధికారులు నిలిపివేశారు. దీంతో 162 సర్వీసులు రద్దయ్యాయి. కాగా కొచ్చిలో కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు.