: విజయమ్మకు సమైక్యాంధ్ర సెగ


వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు సమైక్యాంధ్ర సెగ తప్పలేదు. కడప జిల్లా పులివెందులలోని ఆమె నివాసాన్ని ఈ ఉదయం ఎపీఎన్జీవోలు ముట్టడించారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, షర్మిల పాదయాత్రను పూర్తిచేసుకున్న సందర్బంగా.. వైఎస్ కుటుంబ సభ్యులు నేడు ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్, జగన్ భార్య భారతి, వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News