: షారూక్ ను ఆకాశానికెత్తేస్తున్న బ్రిటన్ మీడియా


బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ బ్రిటన్ మీడియాకు తెగ నచ్చేశాడు. షారూక్ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ నటుడని అక్కడి మీడియా ప్రస్తుతించింది. బాలీవుడ్ టామ్ క్రూయిజ్ అంటూ ఐటీవీ పొగిడేసింది. తాజా చిత్రం చెన్నయ్ ఎక్స్ ప్రెస్ ప్రచారం కోసం షారూక్ లండన్ వెళ్ళగా, అక్కడ ఆయనకు లభించిన ప్రజాదరణ చూసి ఇంగ్లిష్ మీడియా అచ్చెరువొందింది. ఈ నేపథ్యంలోనే తాజా కథనాలు వెలువరించింది. కాగా, 40+ వయసులోనూ షారూక్ పాప్యులారిటీ అంతకంతకూ పెరుగూతూ పోవడం విశేషం.

  • Loading...

More Telugu News