: 'క్యూరియాసిటీ' తొలి పుట్టినరోజు నేడే


అరుణ గ్రహాన్ని ఆసాంతం శోధించి, అది జీవుల మనుగడకు అనుకూలమో కాదో, ఇంకా ఇతరత్రా సమాచార అన్వేషణకు పంపిన క్యూరియాసిటీ రోవర్ ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్టు 6న 'క్యూరియాసిటీ' అంగారకుడిపై అడుగిడింది. అక్కడి శిలలను పరిశోధించి విలువైన సమాచారాన్ని నాసా కేంద్రానికి పంపింది. నీటి ఆనవాళ్లనూ పట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శాస్త్రవేతలు 'హ్యాపీ బర్త్ డే' పాట వినిపించేట్లుగా 'క్యూరియాసిటీ'లోని ఒక పరికరానికి సందేశం పంపించారు.

  • Loading...

More Telugu News