: ఇలా చేస్తే ఆందోళన తగ్గించుకోవచ్చు
రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిడి కారణంగా ఆందోళన పెరిగిపోతోంది. ఈ ఆందోళన పలు రకాలైన అనారోగ్యాలకు హేతువుగా మారుతోంది. అయితే ఇలాంటి ఆందోళనను తగ్గించుకోవడానికి కొన్ని రసాయనాలతో కూడిన కొత్త తరహా చికిత్సను శాస్త్రవేత్తలు రూపొందించారు.
కొన్ని రకాలయిన రసాయనాలతో మెరుగుపరచిన కాక్స్-2 ఎంజైము ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాలనుండి ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన పటేల్ అనే శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఈ చికిత్స ఆందోళనతోబాటు పలురకాలైన మానసిక రుగ్మతలకు కూడా సమర్ధవంతమైన చికిత్సగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రసాయనాలతో తయారైన కాక్స్-2 ఎంజైము సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఆందోళన నుండి ఉపశమనాన్ని కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆందోళన, మానసిక రుగ్మతలకు సంబంధించిన చికిత్సలో ఈ ఎంజైము కొత్త తరహా చికిత్సా పద్ధతులకు నాంది పలుకుతుందని తాము భావిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని ఈ పరిశోధనలో పాల్గొన్న లారెన్స్ మార్నెట్ చెబుతున్నారు.