: 'రొమాన్స్' కలకలం.. పోస్టర్లు, ఫ్లెక్సీలకు నిప్పు
యువదర్శకుడు మారుతి రూపొందించి, విడుదల చేసిన 'రొమాన్స్' సినిమా వివాదాన్ని రేపింది. ఈ సినిమాలో అశ్లీల భాష హద్దులు దాటిందని, అసభ్య సంభాషణలు తొలగించకపోతే ఊరుకునేది లేదని పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ సంఘాల నేతలు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఈ సినిమా ఆడుతున్న ధియేటర్ వద్దకు చేరుకుని, ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించి దగ్థం చేశారు. చిత్రాన్ని యథాతథంగా కొనసాగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెన్సార్ చేయాల్సిన సంభాషణల్ని సినిమాలో ఉంచారని మండిపడ్డారు.