: పదవులు పట్టుకుని వేలాడొద్దు: వీరశివారెడ్డి


పదవులు పట్టుకుని వేలాడుతున్న కేంద్ర మంత్రులు తక్షణం రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో టీడీపీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనం వహించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. మూడు నెలలపాటు ఉండే పదవులను పట్టుకుని వేలాడి ద్రోహులుగా ముద్ర వేసుకోవద్దని హితవు పలికారు. రాజీనామాలు చేయకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చిరంజీవి డిమండ్ చేయడమంటే విభజనను వ్యతిరేకించడమేనని వీరశివారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News