: కేసీఆర్ గురించి నాకు బాగా తెలుసు.. అతని అబద్దాలు నమ్మవద్దు: జగ్గారెడ్డి


రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రజలకు మేలు జరగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తనకు కేసీఆర్ తో 20 ఏళ్ల అనుబంధముందన్న జగ్గారెడ్డి, ప్రజలను నమ్మించడంలో ఆయనకు ఎవరూ సాటిరారని తెలిపారు. మాయమాటలతో యువకులను రెచ్చగొట్టి, లేని ఆశలు కల్పించి, ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రక్రియలో ముందుకు పోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా నుంచి మెదక్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామనడం పెద్ద అబద్ధమన్నారు. మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఆయన ఏనాడూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి నిజమని భ్రమ పడవద్దని జగ్గారెడ్డి సూచించారు.

  • Loading...

More Telugu News