: సచిన్ సరికొత్త రికార్డు


బ్యాటింగ్ రారాజు సచిన్ కు రికార్డులు కొత్త కాదు. అత్యధిక రికార్డులు నెలకొల్పిన ఆటగాడిగా కీర్తినందుకుంటున్న సచిన్ గతేడాది రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యత్వం పొందిన తరువాత తొలిసారిగా ఈ రోజు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యాడు సచిన్. కాగా, క్రీడాకారుడిగా కెరీర్ కొనసాగిస్తూనే రాజ్యసభ సభ్యుడిగా సమావేశాలకు హాజరవుతూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు సచిన్. సచిన్ ఆటను గ్యాలరీలోంచి చూడడం అలవాటున్న అంజలి, ఇక్కడ కూడా అదే అలవాటును కొనసాగిస్తూ రాజ్యసభలోని గ్యాలరీ నుంచి సమావేశాలను వీక్షించారు.

  • Loading...

More Telugu News