: ప్రధాని, దిగ్విజయ్ లకు సీమాంధ్ర ప్రజావాణి వినిపిస్తాం: జేడీ శీలం


సీమాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ద్విసభ్య ఉన్నతస్థాయి కమిటీ నియమించిందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల మనోభావాలు ముందుగా ప్రధాని, దిగ్విజయ్ సింగ్ లకు తెలియజేస్తామన్నారు. అలాగే హైదరాబాదుపై ప్రజల అభిమతాన్ని కూడా వారికి తెలియజేస్తామని చెప్పారు. రాజీనామాలతో విభజన సమస్య పరిష్కారం కాదని కేంద్రమంత్రి జేడీ శీలం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News