: వరదలతో పాకిస్తాన్ విలవిల
గత మూడు రోజులుగా పాకిస్తాన్ లో కురుస్తున్న భారీవర్షాలతో పోటెత్తిన వరదలకు దాదాపు 53 మంది మరణించారు. ఇళ్లు నీటమునిగాయని, ఆస్తి నష్టం భారీగా సంభవించిందని పాక్ విపత్తుల నిర్వహణాధికారి తెలిపారు. పాకిస్తాన్ లో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ పరిస్థితి నెలకొంటుంది. 2010 వ సంవత్సరంలో ఏకంగా 1700 మంది వరదల కారణంగా మరణించారు. ఈ ఏడాది మరింత సమర్ధవంతమైన చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.