: సచిన్ లేకపోతే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది: శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ లేకపోతే క్రికెట్లో మజానే లేదంటున్నాడు ప్రముఖ క్రికెటర్, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ. "సచిన్ కేవలం వన్డేల నుంచే తప్పుకున్నందుకు ఓపక్క ఆనందంగానే వుంది. ఎందుకంటే, టెస్టుల నుంచి తను రిటైర్ కాలేదు కాబట్టి. టెస్టుల నుంచి కూడా అతను తప్పుకుంటే ఇక టెస్టు క్రికెట్ చచ్చిపోయినట్టే. అందులో పస వుండదు... మజా అసలే వుండదు. అందుకే, సచిన్ టెస్టు క్రికెట్లో కొనసాగాలని కోరుకుంటున్నాను" అంటున్నాడు రణతుంగ.
39 ఏళ్ల వయసులో కూడా, కుర్రాళ్ళ కంటే కూడా బాగా సచిన్ ఆడుతున్నాడని ప్రశంసించాడు. సచిన్లో ఇంకా మంచి క్రికెట్ చాలా మిగిలివుందని రణతుంగ అభిప్రాయపడ్డాడు.