: తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది: చిదంబరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు అనేక అంశాలు పరిష్కరించాల్సి ఉందని, వాటన్నిటినీ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్ధికమంత్రి పి.చిదంబరం తెలిపారు. దీనిపై కేంద్ర హోం శాఖ సమగ్ర విధానపత్రాన్ని కేబినెట్ ముందుకు తీసుకొస్తుందన్నారు. దీనికి సంబంధించి ఓ నోట్ ను సిద్ధం చేస్తున్నట్లు కొంత సేపటి కిందటే రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో కొన్ని విధివిధానా`లు ఉన్నాయని చెప్పారు.
ఈ విధాన పత్రంలో విద్యుత్, నదీ జలాలు, పంపిణీ, ప్రజల భద్రతా అంశాలు , ప్రాథమిక హక్కుల రక్షణ, ఇతర అంశాలు కూడా ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేబినెట్ ఆమోదించాక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడుతుందని, ఆ సంఘం ముందు అందరూ తమ వాదనలు వినిపించవచ్చని వివరించారు. తగిన సమయంలో ఈ నోట్ పై కేంద్రప్రభుత్వం చర్చకు అవకాశం ఇస్తుందన్నారు.