: సీమాంధ్రలో రేపు వినోద ఛానెళ్ల ప్రసారం బంద్
రాష్ట్ర విభజనకు నిరసనగా రేపు సీమాంధ్రలో వినోద ఛానెళ్ల ప్రసారాలు నిలిపి వేస్తున్నట్టు కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రకటించింది. కాగా, గత రెండు రోజులుగా ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కేబుల్ వినోద ప్రసారాలను నిలిపివేశారు. వీరి నిర్ణయానికి ప్రజలు కూడా అనుకూలంగా స్పందించడంతో, ఈ నిర్ణయం సీమాంధ్ర ప్రాంతం మొత్తం అమలు చేస్తున్నట్టు కేబుల్ సంఘం ప్రకటించింది.