: ఆజాద్ తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ


తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ను కలుసుకున్నారు. బాంబు పేలుళ్ళ క్షతగాత్రులను పరామర్శించడానికి నిన్న సాయంకాలం హైదరాబాదుకు వచ్చిన ఆజాద్ లేక్ వ్యూ అతిథి గృహంలో బస చేశారు.

ఈ ఉదయమే టీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య తదితరులు ఆజాద్ ను కలుసుకున్నారు. తెలంగాణా అంశంపై సానుకూలంగా సత్వర నిర్ణయం తీసుకోవలసిన ఆవశ్యకత గురించి వీరు ఆజాద్ కు వివరించినట్టు సమాచారం.           

  • Loading...

More Telugu News