: ఉమ్మడి రాజధానికి బీజేపీ వ్యతిరేకం: దత్తాత్రేయ
హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఆయన ఈ ఉదయం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. బీజేపీ సమర్థించడం వల్లే కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకుందన్నారు. సీమాంధ్రలో తాజా పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే కారణమని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతూ.. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును 10ఏళ్ల పాటు ఉంచాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ నిన్న మరోమారు స్పష్టం చేశారు.