: మంత్రి రఘువీరాకు సమైక్య సెగ


మంత్రి రఘువీరారెడ్డికి సమైక్య సెగ తగిలింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రయత్నించింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం అంతకంతకూ ఉధృతరూపం దాల్చుతోంది. పెనుగొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.

  • Loading...

More Telugu News