: 15 కోట్ల రూపాయల సైన్స్ బహుమతి!
సైన్స్ పరిశోధనలు చేసే వారికి శుభవార్త! ఇంతవరకు ప్రపంచంలో లేనటువంటి స్థాయిలో భారీ మొత్తంతో సైన్స్ బహుమతిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ సామాజిక నెట్వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్', సెర్చ్ ఇంజిన్ 'గూగుల్' కలిసి 15 కోట్ల రూపాయలతో సైన్స్ పరిశోధనకు భారీ బహుమతిని ఏర్పాటు చేస్తున్నాయి.
మానవ ఆయుష్షును పెంచేందుకు బృహత్తరమైన పరిశోధనలు చేసే వారికి ఈ బహుమతిని ప్రకటిస్తారు. విశేషం ఏమిటంటే, నోబెల్ బహుమతి కన్నా ఇది రెండింతలు ఎక్కువ. వ్యాపారంలో ఒకరికొకరు గట్టి పోటీదారులైన ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు ఈ సైన్స్ అవార్డు విషయంలో ఇలా ఒకే వేదికపైకి కలసి రావడం అభినందించ దగ్గా విషయం!