: కిల్లి కృపారాణి రాజీనామాకు జేఏసీ డిమాండ్
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేయాలంటూ సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు వరుసగా ఆరోరోజూ కొనసాగుతున్నాయి. టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసం ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆటో యూనియన్లు శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీ చేపట్టాయి. సాయంత్రం ఏడు రోడ్ల కూడలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.