: మూడు గంటలకు సీమాంధ్ర మంత్రులు,ఎంపీల భేటీ
ఈ మధ్యాహ్నం మూడు గంటలకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అంశంపై నేతలు చర్చించనున్నారు. అటు, పార్లమెంటు సమావేశాల్లో సమైక్యాంధ్ర రాగాన్ని వినిపించడంపై కూడా చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపైనా నిర్ణయం తీసుకుంటారు.