: 26 జీవోల కేసులో మంత్రులకు తాత్కాలిక ఊరట
సంచలనం సృష్టించిన 26 జీవోల కేసులో ఆరుగురు రాష్ట్ర మంత్రులకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో మంత్రులను, 11 మంది ఐఏఎస్ లను నిందితులుగా చేర్చాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, అక్కడే అభ్యంతరాలు చెప్పాలని పిటిషనర్ కు న్యాయస్థానం సూచించింది.