: మంత్రి అహ్మదుల్లాపై చెప్పులు విసిరిన సమైక్యవాదులు
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిచ్చేందుకు వెళ్ళిన మంత్రి అహ్మదుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. కడపలో ఆయనపై ఆందోళనకారులు చెప్పులు విసిరి తమ నిరసన తెలియజేశారు. ఆయన రాజీనామా చేయాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఆయన సమైక్యవాదులకు నచ్చజెప్పే యత్నం చేశారు.