: సైకిలు కొనడం ఇకపై అంత 'వీజీ' కాదు!
ఇకపై షాపుకెళ్ళి మామూలు సైకిలు కొనాలంటే కేవలం డబ్బులుంటేనే సరిపోదు... సదరు వ్యక్తి తన గుర్తింపు కార్డు కూడా చూపించాల్సి వుంటుంది. హైదరాబాదు, దిల్ షుక్ నగర్లో మొన్న జంట పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిళ్ళు వినియోగించడంతో ప్రభుత్వం సైకిళ్ల అమ్మకాలను కఠినతరం చేయడానికి నిర్ణయించుకుంది.
అందులో భాగంగా కొనుగోలుదారు తన ఫొటో గుర్తింపు కార్డు, చిరునామా రుజువుకు సంబంధించిన కాపీలు అందజేసిన తర్వాతే సైకిలు అమ్మేలా నిబంధనలు పెడుతున్నారు. ఇప్పటికే సైకిళ్ళు వున్నా వారు కూడా తమ గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలను అందజేయాల్సి వుంటుంది. ఒక విధంగా ఇది కూడా మోటారు వాహనం రిజిస్ట్రేషన్ లాంటిదే!
ఇందుకు సంబంధించి రాష్ట్ర హొమ్ శాఖ ఇప్పటికే దీనిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. దీని వల్ల ఇలాంటి పేలుళ్లు జరిగిన సందర్భంలో సైకిలు యజమానిని గుర్తించడం వీలవుతుందని భావిస్తున్నారు!