: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరీక్షల నిరవధిక వాయిదా
విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఎన్. మురళీమోహన్ తెలిపారు. ఈ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ పరీక్షలను, న్యాయశాస్త్ర నాలుగవ సెమిస్టర్ పరీక్షలను, ఇంతకు ముందే తేదీలు ప్రకటించిన పరీక్షలను పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చల్లబడిన తరువాత తిరిగి పరీక్ష తేదీలను ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు పరీక్షలు వాయిదా వేసిన విషయాన్ని గమనించాలని కోరారు.