: శత్రుఘ్నసిన్హాను పార్టీలోకి ఆహ్వానించిన జేడీ(యు)


నటుడు, బీహార్ బీజేపీ నేత శత్రుఘ్నసిన్హాను జేడీ(యు) పార్టీలోకి ఆహ్వానించింది. ఏ సమయంలోనైనా ఆయన జేడీ(యు)లో చేరవచ్చని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. శత్రుఘ్నసిన్హా కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయనకు స్వాగతం పలుకుతున్నామని పాట్నాలో మీడియా ఎదుట వెల్లడించారు. ప్రధాని అభ్యర్థిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ అర్హుడంటూ కొన్నిరోజుల కిందట సిన్హా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే ఆ పార్టీ ఆయనను ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే, బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ పేరు దాదాపుగా ఖరారవడం, ఇందుకు పార్టీ నేతలందరూ చూచాయగా ఆమోదం తెలపడం కూడా జరిగింది.

  • Loading...

More Telugu News