: అన్నకు పాదయాత్ర విశేషాలు వివరించిన షర్మిల
సుదీర్ఘ పాదయాత్రను ముగించుకున్న షర్మిల ఈ ఉదయం చంచల్ గూడ జైలులో సోదరుడు జగన్ ను కలుసుకున్నారు. ఉదయం విశాఖ నుంచి నేరుగా తల్లి విజయమ్మతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం నేరుగా జైలుకు వెళ్లి అన్నను కలుసుకున్నారు. పాదయాత్ర తీరు, ప్రజల స్పందన, ఇతరత్రా విశేషాలను ఆమె జగన్ కు తెలియజేసినట్లు సమాచారం.