: జలదిగ్బధంలో 46 లంక గ్రామాలు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు లంక గ్రామాలకు శాపంగా మారాయి. తీవ్రంగా పెరిగిన గోదావరి వరద ఉధృతితో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో 46 లంక గ్రామాలు రెండు రోజులుగా జలదిగ్బధంలో నానుతున్నాయి. కనీసం తాగేందుకు నీరు, తినడానికి ఆహారం లేక లంక గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.