: స్మార్ట్ ఫోన్లకు పిల్లల్ని దూరం ఉంచండి


పసిపిల్లలు స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నట్లయితే వారిలో మెదడు వృద్ధి చెందడంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు సలహా చెబుతున్నారు. మెడదు ఎదుగుదల సక్రమంగా ఉండదని చెబుతున్నారు. ప్రత్యేకించి.. పసికందులు ఆడుకోవడానికి స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచేవారు... భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యానికి కీడు చేస్తున్నట్లేనని నిపుణులు అంటున్నారు. ఓ కొత్త అధ్యయనం ప్రకారం.. రెండేళ్లు అంతకంటె తక్కువ వయస్సున్న పిల్లల్లో 25 శాతం మంది తమ సొంత స్మార్ట్‌ ఫోన్లను కలిగి ఉంటున్నారట. తమ పిల్లలు నేర్చుకోవడానికి ఒక మంచి సాధనంగా తల్లిదండ్రులు దీన్ని అందిస్తున్నారట. అయితే దీనివలన దుష్ఫలితాలు తప్పవని పలువురు అంటున్నారు.

అయితే ఆ వయస్సు పిల్లలకు మరీ అనువైనది కాదని నిపుణులు అంటున్నారు. వారు నేర్చుకోవడం మాట అటుంచి, దృష్టి మరలిపోతుందని వారి సలహా. ముచ్చటకొద్దీ స్మార్ట్‌ ఫోన్లలను పిల్లలకోసం కొనే తల్లిదండ్రులూ వింటున్నారా?

  • Loading...

More Telugu News