: సరైన ఆహారంతో నిద్రలేమి సమస్య దూరం


సాధారణంగా మానసికంగా ఉండే ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోకుండా ఉండడం జరుగుతుంది. అయితే మనం తినే ఆహారం కూడా మన నిద్రపై ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు. సరైన ఆహారం తీసుకుంటే దాని ప్రభావం నిద్రపై కూడా పడుతుందని, మంచి నిద్ర వచ్చేందుకు సరైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మన ఆహారంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ డిలు బాగా ఉండేలా చూసుకుంటే అవి మన నిద్రపై కూడా ప్రభావం చూపుతాయని, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మెగ్నీషియం మన నిద్రను క్రమబద్దీకరిస్తుంది. మెగ్నీషియం లోపంవల్ల వచ్చే సమస్యల్లో ఇన్సోమ్నియా ఒకటి. ఈ మెగ్నీషియం ఆకుపచ్చని కూరగాయల్లో, నువ్వుల్లోను, గుమ్మడి గింజల్లోను ఉంటుంది. అలాగే పొటాషియం కూడా నిద్రలోని సమస్యలను దూరం చేస్తుంది. ఇది ఎక్కువగా బీన్స్‌, ఆకుకూరల్లోను ఉంటుంది. ఇక విటమిన్‌ డి సూర్యరశ్మిలో ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇంకా సాల్మన్‌, టూనా చేపల్లో కూడా ఈ విటమిన్‌ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఇక నిద్రలేమి సమస్యలను చక్కగా దూరం చేయవచ్చట.

  • Loading...

More Telugu News