: తప్పులు చూపినా బహుమతే


ఎక్కడైనా ఎవరిలోనైనా తప్పులు గురించి వారికి చెబితే కొందరైతే చిరుబురులాడతారు, మరికొందరు థ్యాంక్స్‌ చెప్పి తమ తప్పులను సర్దుబాటు చేసుకునే దిశగా ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ మాత్రం తప్పులు గురించి చెప్పినవారికి చక్కటి నజరానా ఇవ్వబడుతుంది. ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌ తమ వెబ్‌సైట్‌లో ఉన్న తప్పులను ఎత్తిచూపించిన వారికి చక్కగా నజరానా ఇస్తోంది. అలా ఇప్పటికి సుమారు 6 కోట్ల రూపాయలు నజరానాగా చెల్లింపులు చేసింది.

ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్లో ఉన్న బగ్స్‌ను గుర్తించి ఫేస్‌బుక్‌కు నివేదించిన వారికి ఆ సంస్థ చక్కటి నగదు బహుమతులను అందజేస్తోంది. ఆవిధంగా సుమారు రూ.6 కోట్ల మేర నగదు బహుమతుల రూపంలో అందజేసింది. అంతేకాదు అలా తమ వెబ్‌సైట్లోని లోపాలను ఎత్తిచెప్పిన వారిలో ఇద్దరికి తమ సంస్థలో శాశ్వత ఉద్యోగాలను కూడా ఇచ్చింది. ఇలా బగ్స్‌ గుర్తించిన వారిలో 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇలా ఎక్కువ మొత్తంలో నజరానాలను అందుకున్న వారిలో అమెరికా వారు మొదటి స్థానంలో ఉండగా, భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 51 దేశాలకు చెందిన సుమారు 329 మంది ఇలా ఈ వెబ్‌సైట్లోని బగ్స్‌ను గుర్తించి ఆ సంస్థకు నివేదించారు.

  • Loading...

More Telugu News