: 38 ఏళ్ళ అనంతరం పతకం గెల్చారు
భారత జూనియర్ మహిళల జట్టు ప్రపంచ వరల్డ్ కప్ టోర్నీలో కాంస్యం సాధించింది. జర్మనీలోని మోంచెన్ గ్లాడ్ బాచ్ లో ఈ టోర్నీ జరిగింది. కాగా, కాంస్యం కోసం పోరులో భారత్ అమ్మాయిలు 3-2తో ఇంగ్లండ్ ను మట్టికరిపించారు. అంతకుముందు స్పెయిన్ పై క్వార్ట్రర్స్ పోరులో నెగ్గిన భారత్.. సెమీస్ లో నెదర్లాండ్స్ పై ఓడిపోయింది. కాగా, 38 ఏళ్ళ అనంతరం ఓ భారత జట్టు ప్రపంచకప్ హాకీ పోటీల్లో పతకం గెలవడం ఇదే ప్రథమం.