: భారత ఎంబసీపై దాడి మా పని కాదు: తాలిబాన్లు


ఆఫ్ఘనిస్తాన్ లోని భారత దౌత్య కార్యాలయం వద్ద నిన్న జరిగిన దాడిలో తమ ప్రమేయంలేదని తాలిబాన్లు స్పష్టం చేశారు. కాబూల్ లోని భారత ఎంబసీ ముందు ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు తమను తాము పేల్చేసుకోగా, పది మంది మరణించారు. చనిపోయిన వారిలో పలువురు మహిళలు, పిల్లలు ఉండడం పట్ల అంతర్జాతీయ సమాజం ఖండించింది. ఇటీవలే ఆఫ్ఘన్ కు భారత్ ఓ ప్రత్యేక భద్రత దళాన్ని పంపిన నేపథ్యంలో తాలిబాన్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు వార్తలొచ్చాయి. దీనిపై తాలిబాన్లు నేడు వివరణ ఇచ్చారు. దాడి చేసింది తాము కాదని స్పష్టీకరించారు.

  • Loading...

More Telugu News