: త్వరలో హైదరాబాదులో ఏపీఎన్జీవోల బహిరంగ సభ
సమైక్యాంధ్రను కాంక్షిస్తూ త్వరలోనే హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఏపీఎన్జీవో సంఘం ప్రకటించింది. విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించిన ఏపీఎన్జీవో సంఘాల భేటీ ముగిసింది. అనంతరం మీడియా సమావేశంలో ఎన్జీవో నేత అశోక్ బాబు మాట్లాడుతూ, హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తూ కాదని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనకు సహకరించడం దురదృష్టకరమన్నారు. ఇకపై రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరుతో ఉద్యమం సాగిస్తామని వెల్లడించారు. ఈ నెల 12 లోపు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుంటే, పాలన స్థంభింపజేస్తామని హెచ్చరించారు. నేతలను మళ్ళీ గెలిపించే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు.