: కేసీఆర్, జగన్ మద్దతుతో రాహుల్ ను ప్రధాని చెయ్యాలనే..: టీడీపీ


రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి సీమాంధ్రల్లో నిరసన జ్వాలలకు కారణమైందంటూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్, జగన్ ల మద్దతుతో కుమారుడు రాహుల్ ను ప్రధాని పీఠంలో కూర్చోబెట్టేందుకే, సోనియా విభజనకు పాల్పడిందని టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తమనేమీ సంప్రదించలేదని వారే చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారని బొజ్జల మండిపడ్డారు. ఇక, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News