: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ నెల 30 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. అవసరమైతే కొద్దిరోజులు పొడిగిస్తామని మంత్రి చెప్పారు. కీలకమైన తెలంగాణ బిల్లుతోపాటు ఆహార భద్రత బిల్లును పాస్ చేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. కాగా, నిన్న ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ నిర్వహించి, వర్షాకాల సమావేశాల తీరుతెన్నులపై చర్చించారు.