: సీఎం సీమ పౌరుషంతో రాజీనామా చేయాలి: నన్నపనేని
తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి స్పందించారు. సీఎం కిరణ్ సీమ పౌరుషంతో రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే కాంగ్రెస్ హైకమాండ్ దారిలోకొస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. హైదారాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, సీఎం పీఠం కోసం బొత్స ఆడే నాటకాలను గమనించాలని కిరణ్ కు సూచించారు.