: వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా రవీంద్ర జడేజా
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. గతకొన్నాళ్ళుగా నిలకడగా రాణిస్తున్న జడేజా ఐసీసీ తాజా ర్యాంకుల్లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. జడ్డూ ఏకంగా నాలుగు ర్యాంకులు ఎగబాకి టాప్ ప్లేసుకు చేరడం విశేషం. అయితే, జడేజా విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తో సంయుక్తంగా ఈ టాప్ ర్యాంకును పంచుకోవాల్సి ఉంటుంది. జడేజా (733) రేటింగ్ పాయింట్లు కూడా నరైన్ (733) రేటింగ్ పాయింట్లతో సమానం కావడమే అందుకు కారణం. ఇటీవల టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న జడేజా.. చాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ లాడి 12 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత విండీస్ టూర్లోనూ 8 వికెట్లతో మెరిశాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఓ భారత బౌలర్ వన్డే చార్ట్స్ లో అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి.